ప్రపంచాన్ని జయించినంత ఆనందం..!!

టైం..
రాత్రి 9 గంటల 50 నిమిషాలు
ప్లేస్..
బంజారాహిల్స్, రోడ్ నంబర్ 10
ఆఫీస్ బయోమెట్రిక్ మిషన్ లో ఔట్ పంచ్ కొట్టి బయటకు వచ్చాను.
అప్పకే ఆఫీస్ ముందు ఉంటానని చెప్పిన మిత్రుడు ఇంకా రాలేదు.
సమయం 9 గంటల 58 నిమిషాలు
వెయిట్ చేయడం నా వల్ల కావట్లేదు
ఫోన్ చేద్దాం అనుకుంటుండగానే బైక్ మీద రానే వచ్చాడు
ఈ ఆత్రంలో మా దగ్గరికి ఓ కారు డ్రైవర్ వచ్చిండు
అన్నా వెయికిల్ ఇక్కడపెట్టి మూడురోజులైంది..
సార్ట్ అయితలేదు. కాస్త నెట్టడానికి రండి అన్నడు..
అబ్బా.. ఇప్పుడా..
సరే పదా అని వెళ్లాం
అది ఒకపట్టాన సార్ట్ కావట్లేదు..
నెట్టీ నెట్టీ.. మేమం అలిసిపోయే సమయాన ఇంజన్ కు మెలుకువ వచ్చింది.
ప్లాన్ ప్రకారం..
వెంటనే మా బైక్ సార్ట్ చేసి డైరెక్ట్ గా రోడ్ నంబర్ 12, కమాన్ దగ్గరకు వెళ్లాం మాకు కావాల్సిన షాపు లైట్లు పది సెకెన్ల ముందే ఆర్పేశారు.
అబ్బా కొంచెం ముందొచ్చి ఉంటే బాగుండేది అనుకున్నం..!
-------------------
సంక్రాంతి రోజు సాయంత్రం మిత్రుడి ఫోన్..
అంజి పండగ ఎట్ల జరుపుకున్నవ్..?
పండగ లేదు ఏం లేదు. రాత్రి నైట్ షిఫ్ట్ చేశాను.
పడుకున్నాను..!!
అర్రే.. ఇంటికి వెళ్లలే..
లేదు అన్నాను.
నేను కరీంనగర్ లో ఉన్న..
ఎల్లుండి హైదరాబాద్ వస్తాను..
పార్టీ చేసుకుందాం అన్నడు.
సరే అన్నాను.
అక్కడ సీన్ కట్ చేస్తే..
----------------------
ఆలస్యాన్ని తిట్టుకుంటూ..
రోడ్ నంబర్ 12, ఫెన్షన్ ఆఫీస్ దగ్గరకు వెళ్లాం..
మళ్లీ మాకు నిరాశే ఎదురైంది
అక్కడున్న దుకాణం ఎప్పుడో మూత పడింది.
వెనక్కి వెళ్దామా అన్నాను.
ఇక్కడో షాపు ఉంటది అంటూ..
బైక్ వేగంగా ముందుకు కదిలించాడు మిత్రుడు..
ప్లేస్ చింతల్ బస్తీ..
షాపు దగ్గరకు వెళ్తున్న కొద్దీ
ఒక్కటే ఉత్కంఠ.
ఓపెన్ చేసి ఉంటుందా..? క్లోజ్ చేసి ఉంటుందా..?
రెండు నిమిషాల్లో మా ఉత్కంఠకు తెరపడింది.
నిరాశ పీక్ లెవల్ కు చేరింది.
అంజి ఇంక లాస్ట్...
జీవీకే మాల్ కు ఎదురుగా కొద్దిగా లోపలికి వెళ్తే ఓ షాప్ ఉంటుంది.
అది పదిన్నర వరకు తీసి ఉంటుంది అన్నడు.
అప్పటికే టైం 10:20 నిమిషాలు అవుతోంది.
సరే అన్నాను..
మా వేట మళ్లీ మొదలైంది
అక్కడా షాపు మూతపడే ఉండొచ్చు అనిపిస్తుంది..
మరోవైపు తెరిచే ఉంటదనే ఆశ కూడా కలుగుతోంది.
బైక్ వేగంగా జీవీకే వన్ వైపు వెళుతోంది.
ప్లేస్ తాజ్ బంజారా హోటల్..!!
నిరాశ పటాపంచలైంది.
మనసులో సంతోషం ఉప్పొంగింది.
మా కోసమే అన్నట్లు షాప్ లో లైట్లు మిరుమిట్లు గొల్పతున్నయ్.
నెమ్మదిగా పోలీస్ సైరన్ వినిపిస్తోంది.
క్షణం ఆలస్యం చేయకుండా మిత్రుడు షాప్ దగ్గరకు వెళ్లి
రెండు కింగ్ ఫిషర్ బీర్లు ఇవ్వండి అన్నడు..
షాపు వాడు బీర్లని నల్ల కవర్లో పెట్టి చేతికివ్వగానే..
కింగ్ ఫిషర్ అధినేత పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా..
మేమే కింగులమై ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది.
అంతలోగానే పోలీస్ వెయికల్ అక్కడికి వచ్చి ఆగింది.
షాపులో లైట్లు ఆరిపోయినయ్..
అప్పుడు తెలిసింది మాకు ఒక్క నిమిషం విలువేంటో .
బీరు కోసం ఇంత తాపత్రయపడుతున్నరంటే
వీళ్లు మాంచి తాగుబోతులని స్టాపేయకండి.
తాగాలనే ఆఆలోచన మైండ్లో ఫిక్సైనందునే
ఈ ఆరాటం.
అక్కడి నుంచి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వైపు కదిలింది మా బైక్.
స్పాట్... ప్యారడైజ్ పార్సిల్ పాయింట్..
ఓ చికెన్ బిర్యానీ తీసుకుని
కమాన్ లోపల ఉన్న ఎన్ బీ టీ నగర్ లోని నా రూంకు చేరుకున్నం
సమయం 10:45నిమిషాలు..
హెచ్చరిక: మద్యపానం ఆరోగ్యాని హానికరం

0 comments:

My Web Count